చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదు: వైవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T23:07:35+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి చరిత్రలో ఎన్నడూ జరగలేదని తెలిపారు.

చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి చరిత్రలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. తిరుమలలో దళారి వ్యవస్థను.. అవినీతిని పూర్తిగా నిర్మూలించామని ఆయన చెప్పారు. పారదర్శకత కోసమే టీటీడీని‌ కాగ్ పరిధిలోకి తెచ్చామని పేర్కొన్నారు. టీటీడీ డైరీల సంఖ్యను తగ్గించామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, కరోనా కారణంగా భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ముద్రణను 25 శాతం తగ్గించామని వివరించారు. టీటీడీలో ఎక్కడా అన్యమత ప్రచారం జరగడం లేదని సుబ్బారెడ్డి తెలిపారు.


Updated Date - 2020-09-18T23:07:35+05:30 IST