వలంటీరు సజీవ దహనంపై సమగ్ర దర్యాప్తు

ABN , First Publish Date - 2020-12-20T08:38:35+05:30 IST

ఒంగోలులో దివ్యాంగురాలైన వార్డు వలంటీర్‌ భువనేశ్వరి సజీవ దహనంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ప్రకటన చేస్తూ..

వలంటీరు సజీవ దహనంపై సమగ్ర దర్యాప్తు

కారకులను కఠినంగా శిక్షించాలి: చంద్రబాబు 


అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో దివ్యాంగురాలైన వార్డు వలంటీర్‌ భువనేశ్వరి సజీవ దహనంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ప్రకటన చేస్తూ.. ‘వలంటీరు భువనేశ్వరి సజీవ దహనం వెనుక ఏం జరిగింది? ఇది హత్యా? హత్యాచారమా? రాత్రి 8.30కు ఘటన జరిగితే మరుసటి రోజు సాయంత్రం దాకా పోస్టుమార్టం ఎందుకు జరపలేదు? 20గంటల జాప్యం ఎందుకు జరిగింది? కుమార్తె మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఎందుకు పడిగాపులు పడాల్సి వచ్చింది? దీనిపై అత్యున్నత దర్యాప్తు జరపాలి. నిజనిజాలు బయటపడాలి. కారకులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఆమె కాల్‌లిస్టును బహిర్గతం చేస్తే నిజనిజాలు బయటకొస్తాయని పేర్కొన్నారు. రాజమండ్రిలో దళిత బాలికపై గ్యాంగ్‌ రేప్‌, తాడిపత్రి, ఉదయగిరి, చంద్రగిరిల్లో అత్యాచారాలు, 18 నెలల్లో వందలాది మంది మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనమన్నారు. 

Updated Date - 2020-12-20T08:38:35+05:30 IST