ఎందుకీ దాపరికం?

ABN , First Publish Date - 2020-04-07T10:19:20+05:30 IST

ఎంత ఎక్కువ మందికి.. ఎన్ని ఎ క్కువ పరీక్షలు చేస్తే.. కరోనా వైరస్‌ ఎంత మందికి సోకిందో వాస్తవ పరిస్థితి తెలుస్తుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

ఎందుకీ దాపరికం?

ఎన్ని పరీక్షలు చేస్తున్నారో చెప్పరేం?

రాష్ట్రంలో వారంలో వె య్యి శాతం పెరిగిన కరోనా కేసులు

ఢిల్లీ మాదిరిగా ఆంధ్రలోనూ పేదలకు 5 వేలివ్వాలి

ప్రభుత్వ సాయాన్ని వైసీపీ నేతలు పంచుతారా?

ఉద్యోగుల జీతాలు ఆపి కాంట్రాక్టర్లకు బిల్లులిస్తారా?

ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్‌


అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఎంత ఎక్కువ మందికి.. ఎన్ని ఎ క్కువ పరీక్షలు చేస్తే.. కరోనా వైరస్‌ ఎంత మందికి సోకిందో వాస్తవ పరిస్థితి తెలుస్తుందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. కేరళలో ఇప్పటికి పది వేల మందికి పరీక్షలు చేశారని.. మన రాష్ట్రంలో ఎందరికి చేశారో చె ప్పడం లేదని విమర్శించారు. రెండ్రోజుల నుంచి మెడికల్‌ బులెటిన్లలో పరీ క్షల విషయం చెప్పకుండా దాస్తున్నారన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడారు. గడచిన ఒకవారంలో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏకంగా వెయ్యి శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశం మొత్తమ్మీద ఈ పెరుగుదల 222 శాతమని తెలిపారు. ‘గడచిన వారంలో ప్రపంచంలో కరోనాకేసుల పెరుగుదల 62ు ఉంది. అమెరికాలో 105ు, బ్రిటన్‌లో 116ు పెరిగాయి.


మన దేశంలో ఏపీలోనే అత్యధికంగా పెరిగాయి. మన తర్వాత తమిళనాడు(752ు), ఢిల్లీ (418ు)లో ఎక్కువ పెరుగుదల ఉంది. కేరళ, కర్ణాటకలో కేవలం 47.. 75 శాతం ఉంది. మన దేశంలో ఈ కేసులు వంద నుంచి వెయ్యుకి చేరుకోవడానికి 12 రోజులు పట్టింది. వెయ్యి నుంచి రెండు వేలకు చేరుకోవడానికి 5 రోజులు పడితే 2 వేల నుంచి 3 వేలకు చేరడానికి 3 రోజులే పట్టింది. ఈ వేగాన్ని అర్థం చేసుకుని, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజలు కూడా సహకరించాలి’ అని పేర్కొన్నారు.


వారికి రక్షణ తొడుగులేవీ?

వైరస్‌ నిరోధంలో ముందు వరసలో ఉండి పనిచేస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి ఇప్పటికీ సరైన రక్షణ తొడుగులు లేవని, ప్రఽథమ ప్రాధాన్యంగా వారికి అందజేయాలని చంద్రబాబు కోరారు. దేశంలో వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించడానికి తాను విశాఖలో మెడ్‌ టెక్‌ పా ర్క్‌ను నెలకొల్పితే.. తనపై కక్షతో నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని, ఇప్పటికైనా దానిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాలన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పేదలకు ఇచ్చినట్లుగా మన రాష్ట్రం కూడా మొదటి విడతలో ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలన్నారు.


కేంద్రం రూ.వెయ్యి నగదు, 5 కిలోల బియ్యం, కిలో పప్పు, ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఇస్తోందని, మధ్యాహ్న భోజనం కూడా ఇంటికే పంపాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, ఈ కష్టకాలంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్వా రైతులు, పళ్ల తోటల రైతులు, కూరగాయల రైతులు, ధాన్యం రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రభుత్వం గతంలో చెప్పిన మాదిరిగా రూ.3 వేల కోట్ల నిధి పెట్టి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. మొబైల్‌ రైతు బజార్లను విస్తృతం చేయాలని సలహా ఇచ్చారు.


అహంకారంతో ప్రవర్తిస్తున్నారు... 

ఉద్యోగులు నెలంతా చేసిన పనికి వారికి జీతాలు ఇస్తారని, వాటిలో కో త పెట్టి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కాంట్రాక్టర్లకు రూ. వేల కోట్ల బిల్లులు ఎలా ఇవ్వగలుగుతున్నారని నిలదీశారు. తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్న అహంకారంతోనే ఇలా ప్రవర్తిస్తున్నార ని మండిపడ్డారు. ప్రజల తరపున బాధ్యతగా తాము దీనిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ప్రభు త్వం ఇచ్చే వెయ్యి రూపాయలను స్థానిక సంస్థల్లో పోటీచేసే వైసీపీ అభ్యర్థులు పంచడం దుర్మార్గమన్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని, పైగా గుంపులు కార్యకర్తలతో తిరుగుతూ లాక్‌డౌన్‌ స్ఫూర్తిని కూడా దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం, గవర్నర్‌ కూడా పరిశీలన జరపాలని కోరారు.


లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన సమయంలో పలు చోట్ల ఇసుక, మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుపుతున్నారని అన్నారు. ‘విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని అందరి కంటే ముందు మా పార్టీ ఎమ్మెల్యేలే తమ వేత నం విరాళంగా ఇచ్చారు. మాట్లాడాలంటే చాలా ఉన్నా ఇది సరైన సమ యం కాదని మేం సంయమనం పాటిస్తున్నాం. మమ్మల్ని బూతులు తిడతారని భయపడి నోరు మూసుకోలేం’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. ప్రజల తరపునే ఉంటామన్నారు. ఒక సంఘటన ఆధారంగా ఒక మతంపై అపోహలు వ్యాపింపజేయడం సరికాదని బాబు సూచించారు.

Updated Date - 2020-04-07T10:19:20+05:30 IST