కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-08-16T23:15:06+05:30 IST
కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. విజయనగరం జిల్లా కొటక్కిలో

అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. విజయనగరం జిల్లా కొటక్కిలో వర్సిటీ ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని, గత ప్రభుత్వం బోగాపురం ఎయిర్‌పోర్టు దగ్గర 500 ఎకరాలు కేటాయించిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం సౌకర్యాలు లేని చోట స్థలం కేటాయించిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన కమిటీకి ఇదే విషయం చెబుతామని సోము వీర్రాజు తెలిపారు.