కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2020-05-10T21:35:21+05:30 IST

కర్నూలులో కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడిపై కర్నూలు జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్‌డౌన్ తీసేస్తారని

కర్నూలులో కేంద్ర బృందం పర్యటన

కర్నూలు: కర్నూలులో కేంద్ర బృందం పర్యటించింది. కరోనా కట్టడిపై కర్నూలు జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. లాక్‌డౌన్ ఎంతో కాలం ఉండదని, ఏదో ఒక రోజు లాక్‌డౌన్ తీసేస్తారని కేంద్ర బృందం సభ్యులు ప్రొఫెసర్ సంజయ్ కుమార్, సాధూఖాన్ తెలిపారు. కరోనా వైరస్‌తో కలిసి జీవించేలా ప్రజల ఆలోచనలో మార్పు తీసుకురావాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రశంసనీయమని బృందం కొనియాడింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా తగిన వ్యూహాలతో ముందుకెళ్లాలని, టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ ఇంకా వేగంగా జరగాలని డాక్టర్ మధుమిత సూచించారు.

Updated Date - 2020-05-10T21:35:21+05:30 IST