మురిగిపోతున్న కేంద్ర నిధులు

ABN , First Publish Date - 2020-03-02T07:49:50+05:30 IST

వాటర్‌షెడ్‌ డెవల్‌పమెంట్‌, ల్యాండ్‌ డిజిటలైజేషన్‌ పథకం అమల్లో పలు రాష్ర్టాలు చొరవ చూపకపోవడంపట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్‌ కమిటీ అసంతృప్తి...

మురిగిపోతున్న కేంద్ర నిధులు

  • భూ రికార్డుల డిజిటలైజేషన్‌, వాటర్‌షెడ్‌ పథకాలపై రాష్ట్రాల అనాసక్తి

న్యూఢిల్లీ, మార్చి1(ఆంధ్రజ్యోతి): వాటర్‌షెడ్‌ డెవల్‌పమెంట్‌, ల్యాండ్‌ డిజిటలైజేషన్‌ పథకం అమల్లో పలు రాష్ర్టాలు చొరవ చూపకపోవడంపట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ స్టాండింగ్‌ కమిటీ అసంతృప్తి వ్యక్తంచేసింది. దేశంలోని ఈ రెండు కార్యక్రమాల కింద విడుదల చేసిన నిధులు సైతం ఆయా ప్రభుత్వాలు ఖర్చు చేయనట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకంకోసం ఇచ్చిన నిధుల్లో రూ.31.69కోట్లు ఖర్చు చేయలేదు. భూముల రికార్డుల డిజిటలైజేషన్‌ కార్యక్రమం కింద ఇచ్చిన నిధుల్లో కూడ రూ.19.73కోట్లు ఖర్చుచేయలేదు.


Updated Date - 2020-03-02T07:49:50+05:30 IST