దేశీయ వస్తువులను కొనుగోలు చేయండి

ABN , First Publish Date - 2020-09-18T08:35:44+05:30 IST

థర్మల్‌, జలవిద్యుత్తుతో పాటు విద్యుత్‌ సంస్థలకు అవసరమైన పరికరాల కొనుగోళ్లలో దేశీయంగా తయారైన వాటిని కొనుగోలు...

దేశీయ వస్తువులను కొనుగోలు చేయండి

రాష్ట్రాలకు కేంద్రం సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): థర్మల్‌, జలవిద్యుత్తుతో పాటు విద్యుత్‌ సంస్థలకు అవసరమైన పరికరాల కొనుగోళ్లలో దేశీయంగా తయారైన వాటిని కొనుగోలు చేయడానికి  ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరింది. కోవిడ్‌, చైనాతో ఘర్షణల అనంతర పరిణామాలతో విదేశాల నుంచి వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకోవాలని నిర్ణయించిన కేంద్రం... మేకిన్‌ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసిన పరికరాలను వినియోగిస్తే... విదేశీ మారక ద్రవ్యంతో పాటు విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేసింది. ఈమేరకు గురువారం రాష్ట్రాలకు జాబితాను విడుదల చేసింది.

Updated Date - 2020-09-18T08:35:44+05:30 IST