అదనపు రుణాల కోసం రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు
ABN , First Publish Date - 2020-12-21T02:42:52+05:30 IST
అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కి 2,525 కోట్లు, తెలంగాణకు 2,508 కోట్లు అదనపు

ఢిల్లీ: అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌కి 2,525 కోట్లు, తెలంగాణకు 2,508 కోట్లు అదనపు రుణం పొందేందుకు అనుమతిచ్చింది. సులభతర వాణిజ్యం, ఒకే దేశం-ఒకే రేషన్, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసిన ఐదు రాష్ట్రాలకు 16,728 కోట్ల అదనపు రుణపరిమితి కల్పించింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు అనుమతి లభించింది.