ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

ABN , First Publish Date - 2020-11-07T00:10:27+05:30 IST

ఏపీలో క్రిస్టియన్స్‌గా మతం మారి ఎస్సీ, ఓబీసీ వర్గాల ప్రతిఫలాలను పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

ఢిల్లీ: ఏపీలో క్రిస్టియన్స్‌గా మతం మారి ఎస్సీ, ఓబీసీ వర్గాల ప్రతిఫలాలను పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. నకిలీ ఓబీసీ, ఎస్సీ సెర్టిఫికెట్లు పొంది విపత్తు ఉపశమన నిధి నుంచి రూ.5 వేలు పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఏపీలో పాస్టర్లకు రూ.5 వేలు ఇవ్వడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్‌ ఫోరం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని ఏపీ  ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. నగదును అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్‌లకు ఇవ్వాలని నిర్ణయించింది. గుర్తింపు పొందిన మసీదు వారికే కాకుండా... గుర్తింపు పొందని వారికి ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Updated Date - 2020-11-07T00:10:27+05:30 IST