ఇళ్లలోనే ఉగాది.. శుభప్రదంగా ఉండాలి: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-03-25T08:46:28+05:30 IST

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలంతా ఈ ఉగాది పండుగను...

ఇళ్లలోనే ఉగాది.. శుభప్రదంగా ఉండాలి: గవర్నర్‌

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలంతా ఈ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రజలంతా ఈ ఉగాది పండును ఇళ్లల్లోనే ఉండి జరుపుకోవాలని,  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సహకారం అందించాలని గవర్నర్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


Read more