పోలీసులపై సీబీఐ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-08-12T09:15:26+05:30 IST

ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలతో గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన నలబోలు

పోలీసులపై సీబీఐ కేసు నమోదు

గుంటూరు, ఆగస్టు 11: ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలతో గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. గుంటూరుకు చెందిన నలబోలు ఆదినారాయణ, రాయిడి శ్రీనివాసరావు,   తూమాటి శ్రీనివాసరావులను గతేడాది అక్టోబరు 14 నుంచి 31వరకు గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి భార్యలు హైకోర్టులో హెబిఎస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  దీంతో ఆ ముగ్గురిని అదే రోజు చేబ్రోలు పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల అఫిడవిట్‌కు, అరెస్ట్‌ సందర్భంగా చూపిన అంశాలకు తేడా ఉన్న ట్లు గుర్తించిన హైకోర్టు దీనిపైౖ సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ  నివేదిక ఆధారం గా మంగళవారం ఢిల్లీలో సీబీ ఐ... గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌ సీఐ వెంకటరా వు, హెడ్‌ కానిస్టేబుల్‌ సాంబశివరావు, కానిస్టేబుల్‌ వీరాంజనేయులుపై కేసు నమోదు చేశారు.  

Updated Date - 2020-08-12T09:15:26+05:30 IST