జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌ సీజే బెంచ్‌కు బదిలీ

ABN , First Publish Date - 2020-12-01T09:41:44+05:30 IST

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌ సీజే బెంచ్‌కు బదిలీ

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో.. శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌ సీజే బెంచ్‌కు బదిలీ

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దాఖలుచేసిన అదనపు చార్జిషీటులో తన పేరు చేర్చడాన్ని సవాల్‌ చేస్తూ అప్పటి గనులశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఈ కేసులో అప్పటి రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తున్నందున, ఈ కేసును బదిలీ చేసేందుకు సీజేకు నివేదించాలని రిజిస్ర్టీని జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఆదేశించారు.

Updated Date - 2020-12-01T09:41:44+05:30 IST