వివేకా హత్య కేసులో రంగంలోకి సీబీఐ

ABN , First Publish Date - 2020-07-19T08:30:14+05:30 IST

సీఎం జగన్‌ సొంత బాబాయి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోసం సీబీఐ రంగంలో దిగింది. శనివారం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. ఇప్పటికే దర్యాప్తు

వివేకా హత్య కేసులో రంగంలోకి సీబీఐ

  • సిట్‌ నుంచి సమాచారం సేకరణ
  • పలువురు నిందితుల విచారణ!


 కడప, జూలై 18(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ సొంత బాబాయి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోసం సీబీఐ రంగంలో దిగింది. శనివారం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. ఇప్పటికే దర్యాప్తు చేసిన సిట్‌ అధికారులను కలసి కేసు వివరాలను సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో పలువురిని విచారించినట్లు తెలిసింది. 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి వివేకా తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. నాటి సీఎం చంద్రబాబు ఈ కేసు విచారణ కోసం సిట్‌ను నియమించారు. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. అనంతరం జగన్‌ సీఎం అయిన తర్వాత ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించారు. అమాయకులను ఇరికించి.. అసలైన నేరస్థులను వదిలేస్తారేమో..? అని సందేహం కలుగుతోందని హైకోర్టు లో వాదన వినిపించారు. 15 మందిపై తనకు అనుమానం ఉందని వారి పేర్లను వెల్లడించారు. దాంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు కడప జిల్లా పులివెందుల పోలీసుస్టేషన్‌ కేంద్రంగా దర్యాప్తు సాగాలని ఈ తీర్పులో వెల్లడించింది.


అనుమానితులు వీరే

కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (అవినా్‌షరెడ్డి తండ్రి), వైఎస్‌ మనోహర్‌రెడ్డి, రంగయ్య (వివేకా ఇంటి వాచ్‌మెన్‌), ఎర్ర గంగిరెడ్డి(40 ఏళ్లుగా వివేకా సన్నిహితుడు), ఉదయ్‌కుమార్‌రెడ్డి (యూసీఎల్‌ ఉద్యోగి), డి.శివశంకర్‌రెడ్డి (ఎంపీ అవినా్‌షరెడ్డికి సన్నిహితుడు), పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి (దర్యాప్తు సమయంలో మృతి చెందారు), శంకరయ్య (సీఐ), రాయకృష్ణారెడ్డి (ఏఎ్‌సఐ), ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, సురేందర్‌రెడ్డి (పరమేశ్వరరెడ్డి బావమరిది)లపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేస్తూ నాడు హైకోర్టులో పేర్లు వెల్లడించారు. 

Updated Date - 2020-07-19T08:30:14+05:30 IST