సీబీఐ కోర్టులో.. నేటి నుంచి జగన్ కేసుల విచారణ
ABN , First Publish Date - 2020-10-27T08:33:09+05:30 IST
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మంగళవారం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది.

హైదరాబాద్ సిటీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మంగళవారం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది. గత 3 వారాలుగా జరగాల్సిన విచారణ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 27వ తేదీ నుంచి రోజువారీ విచారణ ఉంటుందని కోర్టు అధికారులు తెలిపారు. మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను సత్వరం విచారించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగన్ కేసుల విచారణ మొదలైంది. అయితే సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడం, ఆ తర్వాత భారీ వరదలు, అనంతరం దసరా సెలవుల నేపథ్యంలో వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక నుంచి రోజూ విచారణ జరగనుండడంతో జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.