-
-
Home » Andhra Pradesh » Castewise housing places
-
కులాల వారీగా ఇళ్ల స్థలాలు
ABN , First Publish Date - 2020-12-30T09:03:56+05:30 IST
కుల మతాలకతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నియోజకవర్గమైన ఆచంటలో కులాల వారీగా స్థలాలను కేటాయించడం కలకలం రేపుతోంది.

పెనుమంట్ర, డిసెంబరు 29: కుల మతాలకతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నియోజకవర్గమైన ఆచంటలో కులాల వారీగా స్థలాలను కేటాయించడం కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో కులాల వారీగా, మతాల వారీగా స్థలాలు కేటాయించి లాటరీలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ప్రముఖ నాయకులు కలిసి.. షెడ్యూల్ కులాలకు చెందిన 54 మంది లబ్ధిదారులకు ఓ వైపు, వెనుకబడిన తరగతులకు చెందిన 148 మంది లబ్ధిదారులకు మరో వైపు, అగ్రవర్ణాలైన 148 మందికి మరోవైపు మొత్తంగా 344 మందికి లాటరీ నిర్వహించారు.