ఎంపీ రఘురామపై కుల సంఘాల ఫైర్‌

ABN , First Publish Date - 2020-06-18T08:51:36+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జిల్లాలోని వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కులాలను అవమానించారంటూ ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు

ఎంపీ రఘురామపై కుల సంఘాల ఫైర్‌

నరసాపురం, జూన్‌ 17: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై జిల్లాలోని వివిధ కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కులాలను అవమానించారంటూ ఎంపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌లో రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను దహనం చేసి, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఆకివీడు వైఎస్సార్‌ సెంటర్‌లో ఎంపీ ఫ్లెక్సీపైపసుపు నీళ్లు చల్లి, గాజులు తొడిగి, కోడిగుడ్లు, టమోటాలతో కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అవినీతి ఆరోపణలు తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా యాదవ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంత్రి రంగరాజుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గణపవరంలో అభిమానులు నిరసన ప్రదర్శన చేశారు.

Updated Date - 2020-06-18T08:51:36+05:30 IST