ఆ కేస్ స్టడీని పరిశీలించండి: పవన్
ABN , First Publish Date - 2020-04-28T21:57:30+05:30 IST
కరోనా సాధారణ జ్వరం మాత్రమే అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై జనసేన అధినేత పవన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కరోనా వ్యాధికి సంబంధించి

అమరావతి: కరోనా సాధారణ జ్వరం మాత్రమే అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై జనసేన అధినేత పవన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కరోనా వ్యాధికి సంబంధించి ఒకసారి సైన్స్ న్యూస్‌ను చూడండి అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ సంస్థ ఇచ్చిన కేస్ స్టడీని పరిశీలించాలన్నారు. దానికి సంబంధించి www.sciencenews.org లింక్‌ను షేర్ చేశారు. ‘‘కోవిడ్-19(కరోనా) అందరూ అనుకుంటున్నట్లుగా సాధారణ జ్వరం మాత్రమే కాదన్నారు. చైనాలో కేస్ స్టడీస్ చూడండి. కోవిడ్-19 రోగుల్లో గణనీయంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వెల్లడైంది’’ అని పవన్ పేర్కొన్నారు.