జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-06T21:45:50+05:30 IST

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్నాకు దిగిన లారీ ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు... ధర్నా వ్యవహారం వెనక ఉన్న అధికార పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-06-06T21:45:50+05:30 IST