ఏపీలో ఏడుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా విశాఖలో నమోదు

ABN , First Publish Date - 2020-03-24T03:20:26+05:30 IST

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. తాజాగా విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడికి..

ఏపీలో ఏడుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా విశాఖలో నమోదు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. తాజాగా విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంగ్లండ్ నుంచి వచ్చిన 25 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. యువకుడి రక్త నమూనాలకు పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా ఉంది. కరోనా లక్షణాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే 15 మంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీళ్ల శాంపిల్స్‌ను పుణే ల్యాబ్‌కు పంపారు. వీటికి సంబంధించిన నివేదిక కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 177 మందికి పరీక్షలు నిర్వహించారు. వీళ్లలో 168 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఏడుగురి నివేదికలు రావాల్సి ఉంది. 

Updated Date - 2020-03-24T03:20:26+05:30 IST