ప్రకాశం జిల్లాను దడ పుట్టిస్తున్న కరోనా..

ABN , First Publish Date - 2020-09-13T13:18:37+05:30 IST

ప్రకాశం జిల్లాను కరోనా వైరస్ దడ పుట్టిస్తోంది.

ప్రకాశం జిల్లాను దడ పుట్టిస్తున్న కరోనా..

ప్రకాశం: జిల్లాను కరోనా వైరస్ దడ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 861 కేసులు నమోదయ్యాయి. ఒంగోలులో అత్యధికంగా 171 కేసులు నమోదుకాగా.. కరోనా భారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37,093కి చేరగా.. మృతుల సంఖ్య 369కి చేరింది. నిన్న (శనివారం) కరోనా బారి నుండి కోలుకుని 1,138 మంది డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 124 మంది చికిత్స పొందుతుండగా.. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 14,851 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-09-13T13:18:37+05:30 IST