కొత్తగా 4,898 కేసులు
ABN , First Publish Date - 2020-10-27T08:19:12+05:30 IST
రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలో 4,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8,08,924కి చేరిన పాజిటివ్‌లు
కరోనాతో మరో 40 మంది మృతి
ఏపీలో 6,606కి పెరిగిన మరణాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలో 4,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.18 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఆదివారం 2,997 మందికి, సోమవారం 1,901 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 8,08,924కి చేరుకుంది. రెండు రోజుల్లో కలిపి పశ్చిమగోదావరిలో 826 మందికి వైరస్ సోకగా.. చిత్తూరులో 755, గుంటూరులో 596, తూర్పుగోదావరిలో 567 కేసులు బయటపడ్డాయి.
మరోవైపు 7,557 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,73,548కి పెరిగింది. ఇక ఆది, సోమవారాల్లో 40 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 9 మంది చనిపోగా.. కడపలో 6, కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం జిలాల్లో నలుగురేసి చొప్పున, విశాఖపట్నం, గుంటూరులో ముగ్గురేసి చొప్పున, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరేసి చొప్పు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,606కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో ఆది, సోమవారాల్లో మరో 755 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాధితుల సంఖ్య 79,511కు చేరుకుంది.