-
-
Home » Andhra Pradesh » carona lockdown respond ap home ministry
-
లాక్ డౌన్ విధించినప్పటికీ రోడ్ల మీదకు వస్తున్నారు: హోంమంత్రి
ABN , First Publish Date - 2020-03-24T23:36:25+05:30 IST
కరోనా నివారణకు సామాజిక దూరం చాలా ముఖ్యమని, లేదంటే ఇటలీ మాదిరిగా చాలాప్రమాదం జరిగే అవకాశం ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ..

అమరావతి: కరోనా నివారణకు సామాజిక దూరం చాలా ముఖ్యమని, లేదంటే ఇటలీ మాదిరిగా చాలాప్రమాదం జరిగే అవకాశం ఉందని హోంమంత్రి సుచరిత అన్నారు. లాక్ డౌన్ విధించినప్పటికీ చాలా మంది రోడ్ల మీదకు వస్తున్నారని ఆమె చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు. ఏపీకి విదేశాల నుంచి 11,800 మంది వచ్చారని, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. శానిటైజర్లు లేకున్నా సబ్బుతోనైనా చేతులు కడుక్కోవాలని సుచరిత సూచించారు.