విశాఖలో 163 మంది డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-04-02T03:21:15+05:30 IST

కరోనా లక్షణాలతో ఐసోలేషన్ వార్డుల్లో 110 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు..

విశాఖలో 163 మంది డిశ్చార్జి

విశాఖ: కరోనా లక్షణాలతో ఐసోలేషన్ వార్డుల్లో 110 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ స్పష్టం చేశారు. 273 మంది అడ్మిట్ కాగా 163 మందిని డిశ్చార్జి చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఛాతి ఆస్పత్రిలో 100 మంది,  గీతమ్ ఆస్పత్రిలో 10 మంది ఉన్నట్లు చెప్పారు. వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో 153 మంది ఉన్నారన్నారు. భీమిలి క్వారంటైన్ కేంద్రంలో 38 మంది, ఎలమంచిలిలో 51 మంది, నర్సీపట్నంలో 15 మంది, విశాఖ రైల్వే ఆసుపత్రిలో 45 మంది, గాజువాక వికాశ్ జూనియర్ కాలేజీలో నలుగురు ఉన్నాట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 25 కేంద్రాల్లో 4434 పడకలు ఐసోలేషన్‌కు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  

Updated Date - 2020-04-02T03:21:15+05:30 IST