ఏపీలో 506 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2020-12-13T22:33:50+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో 506 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

విజయవాడ:  రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 506 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో  8,75,531 కరోనా కేసులు చేరాయి.  ఇప్పటివరకు కరోనాతో 7,057 మరణాలు సంబవించాయి. ప్రస్తుతం ఏపీలో లో 4,966 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి 8,63,508 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఈరోజు కరోనాతో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, ప.గో జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. శానిటైజర్, మాస్కులు విధిగా వాడాలని డాక్టర్లు తెలిపారు. 


తెలంగాణలో కొత్తగా 573 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,77,724కి కరోనా కేసులు నమోదు కాగా 1,493 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,68,601 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 127 కరోనా కేసులు నమోదైయ్యాయి.

Updated Date - 2020-12-13T22:33:50+05:30 IST