మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

ABN , First Publish Date - 2020-07-28T23:30:44+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. అంతేకాదు... రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

మళ్ళీ పెరిగిన కరోనా కేసులు...

అమరావతి : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. అంతేకాదు... రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతోన్న పరిస్థితే కనిపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..


మరోవైపు... కరోనా బారిన పడి 58 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,297 కు చేరుకోగా, మృతుల సంఖ్య 1,148 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527  కరోనా యాక్టివ్ కేసులుండగా, మరో52,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


కాగా... గత 24 గంటల్లో 62,979 కరోనా టెస్ట్‌లు నిర్వహించనట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-07-28T23:30:44+05:30 IST