మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజధాని సెగ

ABN , First Publish Date - 2020-02-24T09:02:39+05:30 IST

మహాశివరాత్రి ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన అమరలింగేశ్వరస్వామి రథయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మద్దాలి

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజధాని సెగ

  • రైతుపైకి దూసుకెళ్లిన ఎంపీ నందిగం కారు
  • కాలికి తీవ్ర గాయం.. ఆగకుండా వెళ్లిన సురేశ్‌

గుంటూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన అమరలింగేశ్వరస్వామి రథయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, నంబూరి శంకరరావులకు రాజధాని సెగ తగిలింది. వారికి తమ గోడు వినిపించేందుకు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అమరపురికి చేరుకున్నారు. అయితే, అమరావతి గ్రామ సరిహద్దులోనే పోలీసులు వీరిని ఆపేశారు. దీంతో అక్కడి నుంచి రైతులు, మహిళలు పాదయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. మంత్రి మోపిదేవి కాన్వాయి పొడుగునా రైతులు ‘జై అమరావతి’ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు నంబూరి శంకరరావు, మద్దాలి గిరి వాహనాలు వెళుతున్నపుడు కూడా నినదించారు. ఆ సమయంలో బాపట్ల ఎంపీ సురేశ్‌ కాన్వాయ్‌లోని కారు రైతుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తుళ్లూరు గ్రామానికి చెందిన రైతు తాడికొండ హనుమంతరావు కాలికి తీవ్రగాయమైంది. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. రైతుకు గాయమైనా ఆపకుండా ఎంపీ వెళ్లిపోయారు. 

Updated Date - 2020-02-24T09:02:39+05:30 IST