రాజధాని నిర్ణయంపై ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రెఫరెండం కోరాలి: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2020-08-02T01:57:37+05:30 IST

రాజధాని నిర్ణయంపై ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రెఫరెండం కోరాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం రైతులు

రాజధాని నిర్ణయంపై ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రెఫరెండం కోరాలి: ధూళిపాళ్ల

గుంటూరు: రాజధాని నిర్ణయంపై ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి రెఫరెండం కోరాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే రాజధాని తరలించడం దారుణమన్నారు. రాజధానిపై ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట మాట్లాడడం సీఎం జగన్మోహన్‌రెడ్డి ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాజధానికి మద్దతు తెలిపిన మాట వాస్తవం కాదా?.. రాజధాని రైతుల ఆక్రందనలు, ఆవేదనలు పట్టవా... మహిళల కన్నీళ్లు కనిపించటం లేదా? అని నరేంద్ర ప్రశ్నించారు. అపరిమిత అధికార చేతిలో ఉందని, నియంత పోకడకు పోవటం మంచిది కాదని హితవుపలికారు. నీ మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు రాజధాని రైతుల గొంతు కోయటం భావ్యమా? అని నరేంద్ర ప్రశ్నించారు.

Updated Date - 2020-08-02T01:57:37+05:30 IST