పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమే: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ABN , First Publish Date - 2020-05-13T23:20:23+05:30 IST

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమేనని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. సంగమేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు మెయిన్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమే: వడ్డే శోభనాద్రీశ్వరరావు

అమరావతి: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచటం సమంజసమేనని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. సంగమేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా పోతిరెడ్డిపాడు మెయిన్ కెనాల్‌లోకి నీటిని ఎత్తిపోసి గాలేరు-నగరి ఎస్.ఆర్.బి.సి.కాల్వలకు నీరందింటానికే ఈ జీవో దోహదపడుతుందని చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాల్వలకు సరఫరాయ్యేందుకు నీటిని సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి ముందుగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు పలు అంశాలపై ప్రతిపాదనలు పంపి పర్మిషన్ పొందాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పుకాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలగదని ఏపీ ఇరిగేషన్ శాఖ  మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణ నేతలు, విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా ఏపీ ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వరరావు తప్పుబట్టారు.

Read more