దళిత రైతుల ఆకలి కేకలు వినపడటం లేదా?
ABN , First Publish Date - 2020-09-03T08:06:11+05:30 IST
‘డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలైన

260వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘డాక్టర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలైన వారే దళితులను అణగదొక్కాలని చూస్తున్నారు. అసైన్డ్ రైతులకు న్యాయబద్ధంగా అందాల్సిన కౌలు ఎందుకు ఇవ్వరు’ అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారానికి 260వ రోజుకు చేరాయి. ఉద్దండరాయునిపాలెంలో బుధవారం రైతులు, మహిళలు ‘దళితుల ఆకలి కేకలు’ పేరుతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్‌కు మంచిబుద్ధి ప్రసాదించి అమరావతిని కొనసాగించేలా చూడాలంటూ తుళ్లూరు రైతులు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఆగిన మరో దళిత గుండె:
రాజధాని తరలిపోతోందన్న ఆవేదనతో అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మందడంకు చెందిన ఎస్టీ మహిళ ఉయ్యాల శాంతకుమారి(44) బుధవారం గుండెపోటుతో మరణించారు.