నా పేరిట ఉన్న క్వారీ లీజు రద్దు చేయండి
ABN , First Publish Date - 2020-06-16T10:06:57+05:30 IST
‘నా పేరిట ఉన్న సిరిపురం లేటరైట్ క్వారీ లీజు రద్దు చేయండి, నాకు మైనింగ్ వ్యాపారుల చెర నుంచి విముక్తి కల్పించండి...’అంటూ దోనె పోతురాజు ..

పోలీసులు, రెవెన్యూ అధికారులకు దోనె పోతురాజు ఫిర్యాదు
చింతపల్లి, జూన్ 15: ‘నా పేరిట ఉన్న సిరిపురం లేటరైట్ క్వారీ లీజు రద్దు చేయండి, నాకు మైనింగ్ వ్యాపారుల చెర నుంచి విముక్తి కల్పించండి...’అంటూ దోనె పోతురాజు సోమవారం పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ‘పోతురాజుకు పింఛను కావాలి’ శీర్షికన సిరిపురం లేటరైట్ క్వారీ లీజుదారుడి దీనస్థితిని వివరిస్తూ ఆదివారంనాడు ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ, మండల బీజేపీ నాయకుడు జైతి ప్రభాకరరావు తదితరుల సమక్షంలో పోతురాజు చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అలాగే తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదును అందజేశాడు. ఇరవై ఏళ్ల కిందట కోళ్ల ఫారంలో పనికి వెళ్లిన సమయంలో పరిచయమైన లక్ష్మణ్‌రెడ్డి తన ఇంటిలో కూలి పనికి పెట్టుకుని, సంతకం నేర్పించి, తన పేరిట సిరిపురం లేటరైట్ క్వారీలో తవ్వకాలకు అనుమతు లు పొందాడన్నారు. తనకు సంబంధం లేకుండా క్వారీలో తవ్వకాలు జరుగుతున్నాయని, తన పేరిట ఉన్న క్వారీ లీజు రద్దు చేసి, తనకు వృద్ధాప్య పింఛన్, ఉపాధి హామీ కార్డు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు.