‘కరోనా’ సేవకులకు 10లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-03-27T08:15:35+05:30 IST
కరోనా నివారణలో భాగంగా ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి రూ.10లక్షల విరాళంతోపాటు, అదనంగా మాస్కులు...
పుంగనూరు, మార్చి 26: కరోనా నివారణలో భాగంగా ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి రూ.10లక్షల విరాళంతోపాటు, అదనంగా మాస్కులు, శానిటైజర్లను అందజేస్తున్నట్లు పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, కల్లూరు, రొంపిచెర్ల పోలీసు స్టేషన్లకు రూ.లక్ష వంతున రూ.6 లక్షలు, పుంగనూరు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు రూ.2లక్షలు, వైద్యఆరోగ్య సిబ్బందికి రూ. 2లక్షలతోపాటు 6వేల మాస్కులు, 100 శానిటైజర్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.