అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు

ABN , First Publish Date - 2020-07-19T15:10:06+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య మళ్లీ రాజకీయాలు రాజుకుంటున్నాయి.

అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య మళ్లీ రాజకీయాలు రాజుకుంటున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి పంపడంతో ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు బిల్లులును గవర్నర్ కేంద్రానికి పంపుతారా? లేఖ గవర్నర్ ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపాక అక్కడనుంచి ఆమోదం రాకుండా మళ్లీ ఎలా ప్రవేశపెడతారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే తాము బిల్లులను పంపామని, అవి ఆమోదం పొందుతాయని అధికారపార్టీ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

Updated Date - 2020-07-19T15:10:06+05:30 IST