కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-03-22T04:55:49+05:30 IST

కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. కృష్ణా, తూ.గో జిల్లాల్లో ..

కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల

అమరావతి: కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. కృష్ణా, తూ.గో జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు స్పష్టం చేసింది. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు  5కి చేరినట్లు పేర్కొంది. శుక్రవారం ఆస్పత్రిలో యువకుడికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారైనట్లు ధృవీకరించింది. ఈ నెల 15న ప్యారిస్‌ నుంచి ఢిల్లీ... హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు వెళ్లిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. 142 మందికి నమూనాలు సేకరించామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 130 నెగిటివ్‌ వచ్చాయని.. 7 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పింది. 42 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 

Updated Date - 2020-03-22T04:55:49+05:30 IST