కేంద్రమంత్రితో భేటీ అనంతరం పోలవరంపై బుగ్గన ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-11-07T00:01:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని.. ప్రస్తుతం నిర్మాణం కూడా పురోగతిలోనే ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుగ్గన సమావేశమై పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు

కేంద్రమంత్రితో భేటీ అనంతరం పోలవరంపై బుగ్గన ఏమన్నారంటే..

ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని.. ప్రస్తుతం నిర్మాణం కూడా పురోగతిలోనే ఉందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో బుగ్గన సమావేశమై పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. 


భేటీ అనంతరం బుగ్గన మాట్లాడారు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్లలో 2,234 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు. మిగిలిన నిధులకు కూడా అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు వెల్లడించారు. 2013-14 అంచనాలకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అతిపెద్ద తప్పు అని ఆరోపించారు. నాటి అంచనాల కంటే భూసేకరణకే రూ.17 వేల కోట్లు అదనంగా ఖర్చవుతుందన్నారు. భూసేకరణలో 2005-06 అంచనాలనే 2013-14 అంచనాల్లో పొందుపరిచారని పేర్కొన్నారు. 2013-14 అంచనాల ప్రకారమైతే ఇబ్బందవుతుందని నిర్మలాసీతారామన్‌కు వివరించినట్లు చెప్పారు.  సవరించిన అంచనాలను సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రాజెక్టు పునరావాసంతో ఖర్చు పెరిగే అవకాశం ఉందని 2014లో కేంద్రం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఆ నిధులు కూడా కేంద్రమే భరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీర్మానాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని బుగ్గన విమర్శించారు.Updated Date - 2020-11-07T00:01:26+05:30 IST