నిర్మలా సీతారామన్‌తో బుగ్గన కీలక భేటీ.. సానుకూల స్పందన

ABN , First Publish Date - 2020-03-14T01:41:37+05:30 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు..

నిర్మలా సీతారామన్‌తో బుగ్గన కీలక భేటీ.. సానుకూల స్పందన

ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ కీలక భేటీలో పలు విషయాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటుకు నిధులు ఇవ్వాలని నిర్మలాను  బుగ్గన కోరారు. రాష్ట్రానికి ఆర్థికంగా ఆదుకోవాలని ఆర్థికమంత్రిని బుగ్గన కోరారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన బుగ్గన.. భేటీకి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.


భేటీలో చర్చకొచ్చిన అంశాలివీ..

‘ స్థానిక సంస్థలకు రావాల్సిన రూ.5 వేల కోట్ల గ్రాంటు విడుదల చేయాలని కోరాం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన 3 వేల కోట్లు విడుదల చేయాలి. పోలవరానికి నాబార్డ్‌ నిధులు రాష్ట్రానికి నేరుగా వచ్చేలా చూడాలని కోరాం. నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. జిల్లాల్లో వాటర్ గిడ్ ప్రాజెక్టులకు సహకరించాలని జలశక్తి మంత్రిని కోరాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించడానికి ఇంకో మూడేళ్లు పడుతుంది. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం.. రెవెన్యూ వృద్ధి 8 శాతం ఉంది అని బుగ్గన మీడియాకు వెల్లడించారు.Updated Date - 2020-03-14T01:41:37+05:30 IST