-
-
Home » Andhra Pradesh » Budha venkanna comments on YCP
-
విజయసాయిరెడ్డి.. దావుద్ ఇబ్రహీంలా వ్యవహరిస్తున్నారు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-12-15T17:42:13+05:30 IST
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్యాక్షనిజం ప్రారంభమైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్యాక్షనిజం ప్రారంభమైందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి.. దావుద్ ఇబ్రహీంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ.. ముగ్గురికి రాష్ట్రాన్ని అప్పజెప్పారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అందరూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తాయని.. మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జె టాక్స్ వసూళ్లు చేసి.. వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు.