స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్‌నే వేసేశారు: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-03-12T19:03:39+05:30 IST

అమరావతి: టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్‌నే వేసేశారు: బుద్దా వెంకన్న

అమరావతి: టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్‌నే వేసేశారని.. సాధారణ బీసీ నేతనైన తనను వదులుతారని అనుకోవడం లేదన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ చంద్రబాబు వెంటే ఉంటానని స్పష్టం చేశారు.


‘‘స్వార్ధ రాజకీయం కోసం సొంత బాబాయ్‌నే వేసేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న... సామాన్య బీసీ నాయకుడైన నన్ను వదులుతారని అనుకోవడం లేదు. ప్రాణం ఉన్నంత వరకూ మా అధినేత చంద్రబాబు వెంటే ఉంటా. ప్రజల మేలు కోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. టీడీపీ నేర్పిన విలువలు, విధానాలకు కట్టుబడి... నియంతపై నా పోరాటాన్ని కొనసాగిస్తా’’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-03-12T19:03:39+05:30 IST