పబ్జీ‌కి బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-12T14:02:35+05:30 IST

పబ్జీ గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేసుతోంది.

పబ్జీ‌కి బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం: పబ్జీ గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. నగరంలో రెవెన్యూ కాలనీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చదువుకుంటుండగా పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఇటీవల ప్రభుత్వం పబ్జీ గేమ్ రద్దు చేయడంతో మనస్తాపానికి గురైన కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్‌కుమార్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-12T14:02:35+05:30 IST