బిర్యానీ కోసం హుండీనే బద్దలుగొట్టారు

ABN , First Publish Date - 2020-09-29T08:06:24+05:30 IST

ఇద్దరు బాలలు బిర్యానీ తినాలనే ఆశతో డబ్బుల కోసం ఏకంగా దేవుని హుండీనే పగులగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో జరిగిన

బిర్యానీ కోసం హుండీనే బద్దలుగొట్టారు

ఏలూరు క్రైం, సెప్టెంబరు 28: ఇద్దరు బాలలు బిర్యానీ తినాలనే ఆశతో డబ్బుల కోసం ఏకంగా దేవుని హుండీనే పగులగొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో గుడి తాళం పగులగొట్టి, అదే పలుగుతో హుండీని ధ్వంసం చేశారు.


దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగతనం చేసింది అదే మండలంలోని జగన్నాఽథపురానికి చెందిన ఇద్దరు బాలురుగా గుర్తించారు. వారిని విచారించగా బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అరెస్ట్‌ చేసి కోర్టు ముందు సోమవారం హాజరు పర్చారు.


ఈ సందర్భంగా ఏలూరులో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో తరచూ నేరాలు జరుగుతూనే ఉంటాయని, కేసులు నమోదవుతుంటాయని తెలిపారు. 


Updated Date - 2020-09-29T08:06:24+05:30 IST