శ్రీశైలంలో దర్శనాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-07-15T09:26:27+05:30 IST

శ్రీశైలంలో కరోనా కలకలం రేపుతోంది. పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో ఆలయ దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్...

శ్రీశైలంలో దర్శనాలకు బ్రేక్‌

కర్నూలు, జూలై 14(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో కరోనా కలకలం రేపుతోంది. పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసులతో ఆలయ దర్శనానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తాజాగా మరో 13 మందికి కరోనా సోకి నట్టు మంగళవారం వైద్యాధికారులు ప్రకటించడంతో దర్శనాలను వారంపాటు నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. శ్రీశైలంలో ఆదివారం మొదటి సారిగా ఐదు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం శ్రీశైలం, సన్నిపెంటలో 13 కేసులు, మంగళవారం మరో 13 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆలయ ఈవో అధికారులతో చర్చించి దర్శనాలను నిలిపివేయడంతోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-07-15T09:26:27+05:30 IST