పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని గొంతు కోసుకున్నాడు
ABN , First Publish Date - 2020-08-17T03:39:23+05:30 IST
జిల్లాలోని గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ఆడేందుకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు

అనంతపురం: జిల్లాలోని గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ఆడేందుకు సెల్ ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో పబ్జీ గేమ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.