జగన్‌ చేతిలో బొత్స బలిపశువు ఖాయం!

ABN , First Publish Date - 2020-09-14T08:20:03+05:30 IST

సీఎం జగన్‌ చేతిలో మంత్రి బొత్స సత్యనారాయణ బలిపశువు కాబోతున్నారని, నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోం

జగన్‌ చేతిలో బొత్స బలిపశువు ఖాయం!

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు తేల్చలేదు

అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం

ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని వెల్లడి

రైతులకు మాజీ మంత్రి ఉమా మద్దతు


గుంటూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ చేతిలో మంత్రి బొత్స సత్యనారాయణ బలిపశువు కాబోతున్నారని, నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని అమరావతి జేఏసీ నేతలు ప్రశ్నించారు. వెలగపూడిలోని జేఏసీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని చెప్తూ వైసీపీ పెద్దలు అమరావతిపై పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.


రాజధానిలో ఉండే ఎస్సీ రైతుల నోట్లో ఈ ప్రభుత్వం మట్టి కొట్టిందని దళిత జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే రాజధాని రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. అమరావతిని దేవుడే కాపాడాలంటూ 29 గ్రామాల రైతులు ఆదివారం పూజలు నిర్వహించారు. నవగ్రహాలలో ఆరు గ్రహాలు స్వక్షేత్రంలోకి ఉచ్చస్థితిలోకి రావడం శుభ ముహూర్తం అంటూ రైతులు ఉదయం 10-45 నుంచి 11.45 వరకు శిబిరాల్లో పూజలు నిర్వహించారు.


రాయపూడి రైతులు కులమతాలకు అతీతంగా పోలేరమ్మకు చీర, సారె సమర్పించి అమరావతిని కొనసాగించేలా చూడాలంటూ పూజలు నిర్వహించారు. అనంతవరంలో ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీనివా్‌సతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మందడం శిబిరంలో జరిగిన పూజాకార్యాక్రమానికి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హాజరై రైతులకు మద్దతు తెలిపారు.

Updated Date - 2020-09-14T08:20:03+05:30 IST