-
-
Home » Andhra Pradesh » botha tour in amaravati
-
అమరావతిలో బొత్స వరుస పర్యటనలు.. రైతుల్లో విస్మయం
ABN , First Publish Date - 2020-06-22T16:51:17+05:30 IST
రాజధాని అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు సరికొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. రైతుల్లో అనేక సందేహాలు లేవనెత్తున్నాయి

అమరావతి: రాజధాని అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు సరికొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. రైతుల్లో అనేక సందేహాలు లేవనెత్తున్నాయి. మంత్రి బొత్స గతంలో రాజధాని గ్రామాలను శ్మశానంతో పోల్చి.. ఇప్పుడు అదే రాజధాని గ్రామమైన రాయపూడిలో పర్యటించడంపై గ్రామస్తుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చాలా రోజుల తర్వాత రాయపూడికి బొత్స రావటంతో గ్రామస్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. శనివారం రాజధాని గ్రామం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఇన్‌టెక్‌వెల్ పనులు, కరకట్ట రోడ్‌ను పరిశీలించారు. బొత్స, సీఆర్డీఏ కమిషనర్ వచ్చి వెళ్లటంతో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవాళ కూడా రాయపూడి సమీపంలో కూడా బొత్స టూర్ కొనసాగుతోంది. బొత్స ఆకస్మిక పర్యటనలపై రాజధాని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఏదో జరగబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.