టీడీపీని ఇంకా చీదరిస్తారు: బొత్స

ABN , First Publish Date - 2020-03-12T10:18:56+05:30 IST

భవిష్యత్తులో టీడీపీని ఇంకా చీదరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ టీడీపీ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు

టీడీపీని ఇంకా చీదరిస్తారు: బొత్స

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో టీడీపీని ఇంకా చీదరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ టీడీపీ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి బొత్స విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్రని మండిపడ్డారు. 


‘స్థానిక’ బరిలో నేతల బంధువులొద్దు: వైసీపీ

స్థానిక ఎన్నికల బరిలో ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల బంధువులు పోటీ చేసేందుకు వీల్లేదని వైసీపీ నాయకత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం వారికి లేఖ రాసింది. ఒకవేళ వారి బంధువులు బరిలో నిలుచుంటే వారికి పార్టీ తరఫున బీ-ఫారాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. పార్టీ విధివిధానాల్లో భాగంగానే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల కుటుంబసభ్యులు, సమీప బంధువులను స్థానిక ఎన్నికల్లో  పోటీకి దించకూడదని నిర్ణయించినట్లు పేర్కొంది. 

Updated Date - 2020-03-12T10:18:56+05:30 IST