నేటి నుంచి 10 వేలు పంపిణీ

ABN , First Publish Date - 2020-05-13T13:19:27+05:30 IST

పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో నివా సం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందజేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

నేటి నుంచి 10 వేలు పంపిణీ

విశాఖపట్నం,(ఆంధ్రజ్యోతి): పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో నివా సం ఉంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి అందజేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ వద్ద మంగళవారం ఆయన మా ట్లాడారు. సీఎం జగన్‌ హామీ మేరకు గ్రామాల్లోని చిన్నారుల నుంచి వయోవృద్ధుల వరకూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ రూ.10 వేల చొప్పు న ఇంటి యజమాని ఖాతాలో జమ చేస్తామన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే ధీమా కల్పించేందుకే బాధిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీలు రాత్రి బస చేశామన్నారు.  

Read more