వారందరికీ వైద్య టెస్టులు నిర్వహించాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ABN , First Publish Date - 2020-04-21T23:13:20+05:30 IST
అమరావతి: కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ బీమా సౌకర్యం కల్పించి వైద్య టెస్ట్‌లు చేయాలని..

అమరావతి: కరోనా విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ బీమా సౌకర్యం కల్పించి వైద్య టెస్ట్‌లు చేయాలని సీఎం జగన్‌కు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞాపన పత్రం అందజేశారు. హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్స్, రెడ్ జోన్స్‌లో ప్రత్యక్షంగా పనిచేస్తున్న అన్నిస్థాయి ఉద్యోగులకు పీపీఈ కిట్స్ అందచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, అధికారులకు మానసిక స్థైర్యం దెబ్బతీయకుండా వారికి, వారి కుటుంబసభ్యులకు సర్కార్ భరోసా కల్పించాలన్నారు. కోవిడ్-19 నివారణ చర్యల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ కరోనా నిర్థారణ పరీక్షలు వెంటనే చేపట్టాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.