వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతోనే ప్రారంభమైంది: బోడె ప్రసాద్

ABN , First Publish Date - 2020-10-04T17:34:09+05:30 IST

వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతోనే ప్రారంభమైందని, ప్రశ్నించే గొంతును ఏదోవిధంగా అడ్డుకోవాలని చూస్తోందని..

వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతోనే ప్రారంభమైంది: బోడె ప్రసాద్

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం విధ్వంసంతోనే ప్రారంభమైందని, ప్రశ్నించే గొంతును ఏదోవిధంగా అడ్డుకోవాలని చూస్తోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. పట్టాభిరామ్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నిన్న విశాఖలో సబ్బంహరి ఇంటి ప్రహరీగోడను కూలగొట్టారని, ఇవాళ పట్టాభి కారు ధ్వంసం చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసే అరాచకాలు, అవినీతిని ప్రశ్నించినందుకు.. ఈ విధంగా దాడులు చేస్తూ.. లోబరుచుకోవాలనే దురుద్దేశంతో దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.


లిక్కర్ విషయంలో ఓ దళితుడు ప్రశ్నిస్తే.. సాక్ష్యాలు లేకుండా.. తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకున్నాడంటే.. ఈ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తుందనేది ప్రజలు అర్థం చేసుకోవాలని బోడె ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నించారనే పట్టాభి కారును ధ్వంసం చేశారని, ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కారు అద్దాలను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. ఇంటి బయట పెట్టిన కారు ముందు, వెనుక అద్దాలను దుండగులు పగులగొట్టారు. తన నివాసం బయట ఉన్న కారును ధ్వంసం చేశారని పట్టాభి తెలిపారు. 


వైసీపీ అవినీతిని బయట పెడుతున్నందుకే తన కారుని ధ్వంసం చేశారన్నారు. తన నివాసం పక్కన హైకోర్టు జడ్జి నివాసం కూడా ఉందన్నారు. అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా తన కారుని ధ్వంసం చేశారన్నారు. 




‘‘నేను కారు ధ్వసం చేస్తే బయపడను.


 నేను పిరికిపందను కాదు. ఎక్కడో సర్వే రాళ్లు తీసుకువచ్చి కారు పగలగొట్టారు. 


నా నోరు మూయించాలని చూస్తే... నేను భయపడను’’ అని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు పట్టాభి నివాసం వద్దకు చేరుకుని సమీక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-04T17:34:09+05:30 IST