ఎమ్మెల్యే పార్థసారధి రూ.50 కోట్ల అవినీతికి పాల్పడ్డారు: బోడె ప్రసాద్

ABN , First Publish Date - 2020-08-20T19:25:32+05:30 IST

విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు.

ఎమ్మెల్యే పార్థసారధి రూ.50 కోట్ల అవినీతికి పాల్పడ్డారు: బోడె ప్రసాద్

విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పేరుతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. పేద ప్రజలకు అందాల్సిన సొమ్ముని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. పెనమలూరులో ఎమ్మెల్యే పార్థ సారధి ఇళ్ల స్థలాల పేరుతో 50 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇళ్ల స్థలాలకు రోడ్లు, మంచి నీరు, విద్యుత్ లాంటి సదుపాయాలు లేకుండా స్థలాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారన్నారు. 
ఇళ్ల స్థలాలు మెరక చేయడానికి ఎకరానికి 30 లక్షలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 


వైసీపీ వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని బోడె ప్రసాద్ ఆరోపించారు. 

Updated Date - 2020-08-20T19:25:32+05:30 IST