గుంటూరు జిల్లాలో పేలుడు.. ఒకరికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2020-10-05T03:27:03+05:30 IST
పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. కాలువ పక్కనే చెత్తను సేకరిస్తుండగా...
గుంటూరు: పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. కాలువ పక్కనే చెత్తను సేకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరికి వినికిడి సమస్య ఏర్పడింది. బాధితులను జీజీహెచ్‌కు తరలించారు. బాంబ్ స్క్వాడ్ టీమ్ ఘటనాస్థలిని పరిశీలిస్తోంది.