తినేది బీజేపీ కూడు.. పాడేది వైసీపీ పాట: వర్ల
ABN , First Publish Date - 2020-02-08T09:49:54+05:30 IST
‘‘ఎంపీ జీవీఎల్ నరసింహారావు బీజేపీ కూడు తింటూ వైసీపీ పాట పాడుతున్నారు. జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి. రాష్ట్ర బీజేపీ నేతలెవ్వరూ లేకుండా జీవీఎల్ సీఎం జగన్‌ను ఎందుకు కలిశాడన్న సందేహం అందరిలోనూ ఉంది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

‘‘ఎంపీ జీవీఎల్ నరసింహారావు బీజేపీ కూడు తింటూ వైసీపీ పాట పాడుతున్నారు. జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి. రాష్ట్ర బీజేపీ నేతలెవ్వరూ లేకుండా జీవీఎల్ సీఎం జగన్‌ను ఎందుకు కలిశాడన్న సందేహం అందరిలోనూ ఉంది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ గతంలో కోర్టులో పిటిషన్ వేసిన జగన్ ఇప్పుడెందుకు దానిని ఉపసంహరించుకున్నాడో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తనతోపాటు సునీత, సౌభాగ్యమ్మలు వేసిన పిటిషన్లు వెనక్కు తీసుకునేలా జగన్ వారిపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సునీత, సౌభాగ్యమ్మలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.